Prime9

MP Kesineni Nani: విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా ఫర్వాలేదు.. ఎంపీ కేశినేని నాని

MP Kesineni Nani: కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలని పొగుడుతున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన కేశినేని నాని విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా ఫర్వాలేదని, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గానైనా గెలుస్తానేమోనని అన్నారు. రాష్ట్రంలో రెండే రాజకీయ వేదికలున్నాయని, అందులో ఒకటి చంద్రబాబు, రెండోది జగన్ అని కేశినేని చెప్పారు. విరోధాలు వాళ్ళిద్దరి మధ్యే ఉన్నాయని కేశినేని నాని చెప్పారు.

పదిసార్లు ఎంపీగా చేయాలని లేదు.. (MP Kesineni Nani)

విజయవాడ అభివృద్దె నా ధ్యేయం.2019 ఎన్నికల్లో ఒక్క టీడీపి కాదు అన్ని పార్టీల వాళ్ళు ఓట్లేస్తేనే నేను గెలిచాను.వాళ్ళ పార్టీ వాళ్ళది, నా పార్టీ నాది, ఓట్లు కోసం ఎవరి వ్యూహాలు వారికీ ఉంటాయి.నేను పదిసార్లు ఎంపీగా చేయాలి అని కోరిక ఏమి లేదు.నేనే ఎంపీగా ఉండాలని రూల్ లేదు.ఈ ప్రాంతం కోసం ఢిల్లీ స్థాయిలో పనిచేయించే సత్తా నా దగ్గర ఉందని నాని అన్నారు. ప్రాంతాల అభివృద్ధి కోసం రాజకీయాలకు ముడి పెట్టకూడదు.పార్టీల కోసం కొట్టుకోమని క్యాడర్ కు ఏ నాయకుడు చెప్పరు.కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు కేంద్ర మంత్రులను తిడతారు.  పనికోసం వెళితే కేంద్ర మంత్రులు చేస్తారని అన్నారు.

దేశం కోసం ఎవరైన పనిచేస్తారు. పార్టీ లు చూడరన్న నాని పార్టీలు కోసం పనిచేయడం వేరు, అభివృద్ధి కోసం పనిచేయడం వేరని వ్యాఖ్యానించారు. పార్టీలు కోసం వ్యక్తిగత ద్వేషాలు, బంధుత్వాలను దూరం చేసుకోవద్దన్నారు. ఢిల్లీ స్థాయిలో ఎవరు వచ్చిన పనిచేస్తానని నాని పేర్కొన్నారు. మైలవరంలో బాలుర హైస్కూల్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని నాని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.

Exit mobile version
Skip to toolbar