Site icon Prime9

Kurnool: అమానవీయ ఘటన.. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే వేధింపులే

gorintaku

gorintaku

Kurnool: కర్నూలు జిల్లాలో అమావనీయ ఘటన చోటు చేసుకుంది. బొట్టు, గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను ప్రిన్సిపల్ వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో విద్యార్థినులకు ఈ ఘటన ఎదురైంది. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతం ఇప్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది.

 

బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే వేధింపులే..

ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటే లక్షణంగా ఉంటారు. మన దేశంలో ఆడపిల్లలు, స్త్రీలు బొట్టు పెట్టుకోవడం అనవాయితీ.

ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. వారి నుదుటికి బొట్టు ఎంత అందమో.. వారికి చేతికి గోరింటాకు కూడా అంతే అందం.

ఈ రెండు ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఆచారం. కానీ కొన్ని పాఠశాలలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

సంప్రాదాయలను స్కూల్, శిక్షణ కేంద్రాలకు తీసుకురావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్నాయి.

ఇలాంటి తాజా ఘటనే.. కర్నూలు Kurnoolజిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ శిక్షణ కేంద్రంలో.. ప్రిన్సిపల్ విద్యార్ధినుల పట్ల దురుసుగా ప్రవర్తించింది.

బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే వారికి జరిమానా విధించడం.. వేధింపులకు గురిచేయడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది.

ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక ఆ ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

కర్నూలు (Kurnool) డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో.. 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గా శిక్షణ ఇస్తున్నారు.

వారికి అక్కడే వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కోర్సుకు ప్రిన్సిపాల్ గా విజయ సుశీల ఉన్నారు.

దీంతో విద్యార్ధులు బొట్టు పెట్టుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా.. వేధింపులకు పాల్పడుతుందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

జరిమానాలతో పాటు.. వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటున్నారని ఆరోపించారు.

మాట వినకపోతే.. పరీక్షలో ఫెయిల్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్ధినిలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రిన్సిపాల్ వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

బాధితులు ప్రిన్సిపల్ పై ప్రాంతీయ శిక్షణ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. ప్రిన్సిపల్ ను వసతి గృహంలో ఖాళీ చేయాలని సూచించారు.

ఫిర్యాదు చేసిన విద్యార్ధులపై విజయ సుశీల ఆగ్రహంతో వారిని బెదిరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. విద్యార్థులకు సెలవులిచ్చి ఇంటికి పంపించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version