Site icon Prime9

Traffic Rules: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జేబుకు చిల్లు

Hyderabad new traffic rules

Hyderabad new traffic rules

Traffic Rules: హైదరాబాద్ సిటీలో ప్రజలకు అలర్ట్. రూల్స్ పాటించకపోతే జేబుకు చిల్లు పడక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు. ఇకపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ కి, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సిందే.

రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రూ.1700 ( 200 + 500 + 1000 ) జరిమానా చెల్లించాల్సిందే. ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే రూ. 1200 ఫైన్ కట్టాల్సిందేనని ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ప్రకటించింది. వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్ సరిగ్గా పాటించి సురక్షితంగా గమ్యం చేరేలా చేయడం కోసమే ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు. ఈ నెల 21 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. అనంతరం 28వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానా విధించనున్నట్టు పేర్కొనింది.

ఇదీ చదవండి: కల్తీ ఆహారానికి చెక్.. కాల్ 040- 2111 1111- జీహెచ్ఎంసీ

Exit mobile version