Site icon Prime9

Fire Accident Hyderabad: పురానాపూల్ లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుమప్పు

fire accident in hyderabad

fire accident in hyderabad

Fire Accident Hyderabad: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. పురానాపూల్ లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు.. (Fire Accident Hyderabad)

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ప్రధాన ప్రాంతమైన.. పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం. ఓ గోదాములో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 6 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రమాదం జరిగింది. గోదాములో మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గోదాంలో కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రిని నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఎక్కువ మెుత్తంలో ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో.. దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగ ఎక్కువగా వ్యాపించడంతో.. మంటలు భారీగా అంటుకున్నాయి.

 

మంటల ధాటికి గోదాం పైకప్పు కూలిపోయింది. అగ్నికీలలు ఎక్కువగా వ్యాపించడంతో.. గోదాం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఇది వరకే.. రాంగోపాల్ పేట్, బాగ్ లింగంపల్లి లో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాం గోపాల్ పేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కాలిబూడిదయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. ఆ తర్వాత బాగ్ లింగంపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని ఇది వరకే హెచ్చరించారు. వ్యాపారస్థులు.. భవన యజమానుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది.

 

Exit mobile version