Site icon Prime9

BJP MP Ravikishan: నేను నలుగురు పిల్లలను కనడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం.. బీజేపీ ఎంపీ రవికిషన్

Ravikishan

Ravikishan

BJP MP Ravikishan: బీజేపీ ఎంపీ రవికిషన్ తాను నలుగురు పిల్లలు కనడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ఆజ్ తక్ చానల్ తో మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిందని, జనాభా నియంత్రణకు చట్టం చేసి ఉంటే తనకు నలుగురు పిల్లలు పుట్టేవారుకారని అన్నారు.దీనికి సంబంధించి పార్లమెంట్‌లో కూడా తీర్మానం చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఇప్పుడు జనాభా విస్ఫోటనం గురించి ఆలోచించినప్పుడు, తనకు నలుగురు పిల్లలు ఉన్నారని పశ్చాత్తాపడుతున్నట్లు చెప్పారు.

జనాభా నియంత్రణలో చైనా మాదిరి చర్యలు తీసుకుంటే ఈ తరంలో ఇన్ని సమస్యలు ఉండేవి కావన్నారు. ఇలాంటి చట్టాల వల్ల ఫలితాలు 20 – 25 ఏళ్ల తర్వాత కనపడతాయని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేవాలయాలే కాకుండా రోడ్లను కూడా నిర్మిస్తోందని అన్నారు. రవికిషన్ తెలుగుచిత్రం రేసుగుర్రంలో విలన్ గా నటించి అందరినీ అలరించారు. అతను యూపీలోని గోరఖ్ పూర్ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎంపికయ్యారు.

 

Exit mobile version