Chikoti Praveen: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్

థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవ్‌రెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి ఉన్నారు.

  • Written By:
  • Updated On - May 1, 2023 / 02:48 PM IST

Chikoti Praveen: థాయ్‌లాండ్‌లో క్యాసినో కింగ్ చికోటి  ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అతను పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవ్‌రెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం చికోటి ప్రవీణ్‌ని ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.థాయ్‌లాండ్‌లో నేరం రుజువైతే కఠిన శిక్షలు ఉంటాయి.

100 కోట్ల బెట్టింగ్..(Chikoti Praveen)

థాయ్‌ల్యాండ్‌లోని .హోటల్‌లో భారతీయులు గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. పటాయాలో 90 మంది భారతీయుల అరెస్ట్ చేశారు అక్కడి అధికారులు. అరెస్టైన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. థాయ్‌ల్యాండ్ మహిళతో కలిసి చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్, 92 సెల్‌ఫోన్లు, 3 నోట్‌బుక్స్, ఐప్యాడ్ , 1.60 లక్షలు థాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు.

చికోటి ప్రవీణ్‌పై నేపాల్, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో జూదం ఆడుతున్నాడని పలు  కేసులు నమోదు చేశారు. ప్రవీణ్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేపట్టింది.హవాలా డబ్బు లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో జూలై 29న అతని నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించడంతో ప్రవీణ్ పేరు వెలుగులోకి వచ్చింది.