Site icon Prime9

Vijayasai Reddy : విశాఖలో విజయసాయి భూదందాలపై సీబీఐ విచారణ జరపాలి.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్

Manikkam Tagore

Manikkam Tagore

#YSRCP: వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విశాఖలోతన కుమార్తె, అల్లుడి కంపెనీ పేరుపై భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన కుమార్తె, అల్లుడు డైరక్టర్లుగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ గత ఏడాది కాలంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

విజయసాయిరెడ్డి ” పేరెన్నికగన్న ఆర్థిక నేరగాడు” అని.. విశాఖలో ల్యాండ్ డీల్స్‌పై ప్రధాన మంత్రి తక్షణం సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. విశాఖలో విజయసాయి రెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. బోగాపురం ఎయిర్ పోర్టు రహదారి అలైన్ మెంట్‌ను కూడా అక్రమంగా మార్చారని ఆరోపణలు చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి స్దానికులను భయపెట్టి, బెదిరించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు తదితరులు గత కొద్దిరోజులనుంచి ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై విజయసాయి రెడ్డి ఇప్పటివరకూ స్పందించలేదు.

Exit mobile version