Site icon Prime9

PM Modi in Rajamahendravaram: మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసారు.. ప్రధాని మోదీ

PM Modi(RjY)

PM Modi(RjY)

PM Modi in Rajamahendravaram: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని మోదీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని వెనక్కు వెళ్లేలా చేసిందని.. గతంలో చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ఏపీలో యువశక్తిని ప్రపంచం గుర్తించిందని.. వైసీపీ ప్రభుత్వం మాత్రం యువశక్తిని గుర్తించలేదని ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వానికి ఆర్దిక నిర్వహణ తెలియదు..(PM Modi in Rajamahendravaram)

ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని అయితే అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యారని ప్రధాని మోదీ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్‌ స్పీడ్‌తో పరిగెత్తిందన్నారు. మూడు రాజధానులు చేస్తామని ఒక్కటీ చేయలేదన్నారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ఏపీని లూటీ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. ఆర్థిక నిర్వహణ తెలియదన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని భావించినా వాటిని వైసీపీ సర్కారు అందుకోలేకపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆపివేసిందన్నారు. ఢిల్లీ-ముంబయ్ కారిడార్ మాదిరి విశాఖ-చెన్నై కారిడార్ నిర్మా ణం చేపడతామని తెలిపారు. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయని చెప్పారు.

భారత్ శక్తిని ప్రపంచానికి చాటారు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అయోధ్యకు రామచంద్రుడిని తీసుకువచ్చిన మహానుభావుడు మోదీ అని కొనియాడారు. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ అని అన్నారు. పదేళ్లుగా భారత్‌ వైపు చూడాలంటేనే శత్రువులు భయపడుతున్నారని అన్నారు. ఏపీలో వైసీపీ కేంద్రపధకాలను తన పధకాలుగా చెప్పుకుంటోందని అన్నారు. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను వేధించారని ఆరోపించారు. మోదీ అధికారంలో ఉండబట్టే అపలైన అర్హులకు పద్మ అవార్డులు వస్తున్నాయని పవన్ చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని విశ్వజిత్ (విశ్వాన్ని జయించినవారని) అభివర్ణించారు. నమో నమో అనే నాలుగు అక్షరాలు దేశం దశ.. దిశ మార్చాయని చప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు పౌరుషాన్ని దేశానికి పరిచయం చేస్తే ప్రధాని మోదీ భారత పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. జగన్ పాలనలో బాధితులు యువతే అని కొత్త పరిశ్రమలు తేకపోగా పాతవాటిని వెళ్లగొట్టారని ఆరోపించారు.

జగన్ ఓడిపోతాడు.. జాతకం చెప్పిన మోడీ | PM Modi Key Comments On Jagan | Prime9

 

Exit mobile version
Skip to toolbar