Prime9

Mandous Cyclone: మాండూస్ తుఫాను బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

Mandous Cyclone: మాండూస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంత వాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. కాగా నేడు మాండూస్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంతో చిక్కుకుని ఉన్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. చాలా మంది లోతట్టు ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా తుఫాను కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ సాయం అందించాలని అధికారులను ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లోని బాధితులకు ఈ ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది.

కాగా మాండూస్‌ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండ పోత వర్షాలు కురవగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అయితే మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, నీటమునిగాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వృక్షాలన్నీ నేలమట్టమయ్యాయి.

ఇదీ చదవండి: బలహీన పడిన “మాండూస్”.. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు

Exit mobile version
Skip to toolbar