Site icon Prime9

Love Affair: ఒకరితో లవ్ మరొకరితో ఎఫైర్.. చివరకి యువకుడు ఏం చేశాడంటే?

hanumakonda

hanumakonda

Love Affair: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని  ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలి బర్త్ డే రోజునే.. ప్రియుడు సుసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జరిగింది.

సెల్ఫీ వీడియో.. (Love Affair)

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలి బర్త్ డే రోజునే.. ప్రియుడు సుసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జరిగింది.

ముల్కనూర్‌ గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు.. సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు.

ఇందులో తాను ప్రేమించిన అమ్మాయి.. ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో వివరించారు.

తాను చనిపోయాక తన డెడ్ బైడీని ప్రియురాలికి చూపించాలని కోరిన తీరు అందరికి కలచివేసింది.

ఈ నెల 17న విష్ణువర్దన్ అనే వ్యక్తి.. సాయిని పిలిపించుకొని దారుణంగా కొట్టి, ఇబ్బందులకు గురిచేశారు. అయితే దీనిపై సాయి సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

కానీ పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో సాయి మరింత కుంగిపోయాడు.

ప్రేమించిన అమ్మాయి, మరో యువకుడు తన జీవితంతో ఆడుకున్నారని.. ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటివారికి విడిచి పెట్టవద్దని వీడియోలో తెలిపాడు.

అయితే శనివారం అమ్మాయి.. పుట్టిన రోజు సందర్భంగా ప్రేమించిన అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపి చనిపోతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.

ఇలా చేస్తే అయినా ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి పుట్టిన రోజున తన మరణాన్ని గుర్తు చేసుకోవాలని కోరాడు.

తను చాలా ఆలోచించానని, అమ్మ, నాన్న, చెల్లి, బావ, నా స్నేహితులందరూ క్షమించాలని కోరాడు.

చావు తప్ప నాకు వేరే మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ అమ్మాయి దూరమైన బాధ తట్టుకోలేక ఈపని చేస్తున్నానని సాయి తెలిపారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

Exit mobile version