Site icon Prime9

Election Manifesto: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్

Election Manifesto

Election Manifesto

Election Manifesto: సీఎం జగన్‌ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టోని విడుదల చేయడం విశేషం . మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెడుతున్నానని అని తెలిపారు .

వైసీపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..(Election Manifesto)

అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు . అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌ చేయూత పథకం 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు . రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటించారు.మొదటి విడత 2028 జనవరిలో రూ.250 , 2029 జనవరిలో 250 లో పెంపు
వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు .వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింది రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు . వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు ఉంటుందని తెలిపారు. కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు .వైద్యం, ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరిస్తామన్న ప్రకటించారు .రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలు పెంపు (కౌలు రైతులకు రైతు భరోసా కొనసాగింపు) ఉంటుంది. అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు .అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు .ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా అమలు . లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు . వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు ఉంటుంది. చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు .నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌ .ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ.. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ .స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా వర్తింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు రుణాలు . ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌ సౌకర్యం కల్పించడం జరుగుతుంది.

బ్యాండేజిని తీసేసిన జగన్..

మరో వైపు జగన్‌ ఎట్టకేలకు నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13 సీఎం జగన్‌ నుదుటికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్యాండేజ్‌ ను వేసుకునే వుంటున్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు సైతం పెద్ద సైజు బ్యాండేజ్‌తో రావడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి.తన సోదరి , వైఎస్‌ వివేకానంద కుమార్తె సునీత సైతం బ్యాండేజ్‌ పై కామెంట్ చేసింది .ఎక్కువ కాలం ఉంటే సెప్టిక్ అవుతుందని సునీత చెప్పారు . మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ మొదలవడంతో బ్యాండేజీ తొలగించి ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేశారు. దీని పై వెంటనే టీడీపీ నేత లోకేశ్‌ ట్వీట్‌ చేసారు . ‘ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం.. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం’ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

 

Exit mobile version