YS Viveka Murder case: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఈ కేసు జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తు అధికారి
రాంసింగ్‌ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి, మరో అధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ..సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఆమె పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం ఆగ్రహం(YS Viveka Murder case)
హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని.. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారని విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది.
కేసు విచారణ త్వరగా పూర్తి చేయని పక్షంలో మరో అధికారిని ఎందుకు నియమించకూడదని కోర్టు ప్రశ్నించింది.
వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదనలు వినిపించారు.
దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది.
హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్(YS Viveka Murder case)
మరో వైపు తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వివేక హత్య కేసులో ఏ-4 దస్తగిరినీ అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు.
దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణ జరిపింది.
కాగా, దస్తగిరినీ అప్రూవర్‌గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ లో..‘దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారు.
వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే.. దస్తగిరి
బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించింది..దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టులు పట్టించుకోలేదు.
దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్’ లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.