Sharmila-Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్‌మెంట్‌కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్‌మెంట్‌కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
వైఎస్సార్ పై చర్చ..( Sharmila-Chandrababu)
ఈ సందర్బంగా ఇద్దరి మధ్యా చాలాసేపు దివంగత వైఎస్ఆర్ గురించి చర్చకి వచ్చింది. వైఎస్ఆర్ గుణగణాలు, తామిద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎలా మెలిగిందీ చంద్రబాబు షర్మిలకి గుర్తు చేశారు. తప్పకుండా వచ్చి వధూవరులని ఆశీర్వదిస్తానని చంద్రబాబు వైఎస్ షర్మిలకి చెప్పారు. దివంగత వైఎస్సార్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసారు. . చంద్రబాబు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత సీఎం అయ్యారు. వైఎస్సార్ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగి సుదీర్గకాలం తరువాత సీఎం అయ్యారు. ఏదైమైనా అప్పడు మొదలయిన వారిద్దరి సాన్నిహిత్యం వైఎస్సార్ చనిపోయే వరకూ కొనసాగింది.
చంద్రబాబును కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిసానని తెలిపారు. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని చెప్పారు. క్రిస్మస్ సందర్బంగా చంద్రబాబు, లోకేష్ కు స్వీట్లు పంపానన్నారు. అదేవిధంగా కేటీఆర్, కవిత, హరీష్ రావులకు కూడా స్వీట్లు పంపానన్నారు. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరని షర్మిల అన్నారు.