Site icon Prime9

YS Sharmila: క‌న్నీళ్లు పెట్టుకున్న వైఎస్ ష‌ర్మిల‌

YS Sharmila

YS Sharmila

YS Sharmila: తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్‌ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్‌ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? అంటూ ఆవేదన వ్యక్తం చేసారు .ఓ టీవీ చానల్ ఇంటర్యూలో కుటుంబంలో విబేధాలకు షర్మిల రాజకీయ కాంక్షే కారణం అన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై షర్మిల శుక్రవారం మీడియా ఎదుట స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారు . తనకు రాజకీయ కాంక్షే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ చెప్పారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించారు.

బైబిల్ మీద ఒట్టేసి చెబుతున్నాను..(YS Sharmila)

జగన్మోహన్ రెడ్డి అరెస్టు టైంలో , 19 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగిందని ఎవరని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని ప్రశఅనించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైఖ్యాంధ్ర, బైబై బాబు క్యాంపెయిన్, తెలంగాణలో పాదయాత్ర చేపించింది మీరు కాదా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నిజంగా రాజకీయ కాంక్ష ఉంటే పాదయాత్ర చేసినప‌్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు వైసీపీని హస్తగతం చేసుకునే ఉంటే అడిగేది ఎవరని మండిపడ్డారు. ఏదన్నా పదవి పొందాలనుకుంటే మొండిగానైనా పొందగలనని షర్మిల స్పష్టం చేశారు. వివేకా లాంటి ఎంతో మంది తనను ఎంపీగా చేయాలని అనుకున్నారు. మీ పార్టీలోనే చాలా మంది ఆలా కోరుకున్న వారు ఉన్నారని గుర్తు చేశారు. నేను నా అన్న కోసం చేశాను. వైఎస్‌ సంక్షేమ పాలన తీసుకొస్తానని నమ్మానని చెప్పుకొచ్చారు. బైబిల్‌ మీద ఒట్టేసి చెబుతున్నాు… నాకు ఎలాంటి రాజకీయ కాంక్ష లేదు. మిమ్మల్ని ఎప్పుడు పదవులు అడగలేదు.. మీరు కూడా బైబిల్‌ పై ప్రమాణం చేస్తారా అని షర్మిల ఎమోషనల్ అయి కంట తడి పెట్టారు.

పైసా సాయం అడిగినట్టు నిరూపించగలరా..

కుటుంబంలో తాను తప్ప ఎవరూ రాజకీయాల్లో ఉండకూడదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. అవినాష్ రెడ్డి బంధువు కాదా అని ప్రశ్నించారు. కమలాపురంలో పోటీ చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి బందువ కాదా అని ప్రశ్నించారు. పైగా తనపై నిందలు వేస్తున్నారని ఏదో ఆర్థిక సాయం, పనులు అడిగారని.. వాటిని ఇచ్చేందుకు జగన్ నిరాకరించినందునే తాను బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పైసా సాయం అడిగినట్టు నిరూపించగలరా అని వైఎస్ జగన్ కు షర్మిల సవాల్ విసిరారు . రాజశేఖర్‌ కొడుకు అనే మాట మర్చిపోయారని విలువల్లేకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Exit mobile version