YS Jagan in Kadapa: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుడు అజయ్ ను పరామర్శించి దైర్యం చెప్పారు. పార్టీ తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సంప్రదాయం ఆపండి..(YS Jagan in Kadapa)
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఓటేసారని 20ఏళ్ళ పిల్లాడిని నిర్దాక్షణ్యంగా కొట్టారని ఆరోపించారు. పులివెందులలో ఇలాంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేదు..కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ సంప్రదాయానికి త్రిలోదకాలు పలికి చెడు సంప్రదాయానికి తెరలేపారని అన్నారు. చంద్రబాబును హెచ్చరిస్తున్నా ఈ సంప్రదాయం ఆపండి..వ్యవస్థను గాడిలో పెట్టండి..మోసపూరిత వాగ్దానాలు నమ్మి ఓట్లశారు. మహిళకు నగదు అన్నారు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు అది చెయ్యండి.ఇంతవరకు స్కూల్ బాగ్స్ అందించలేదు.అతిసారతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ మండిపడ్డారు.