YCP Strategy: భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మైనారిటీ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జగన్ ప్రసంగిస్తూ.. ఎప్పటిలానే ప్రతి మాటకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, అంటూ తమని మోసం చేసాడని ముస్లిం వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. ప్రతి సభలోను మైనారిటీల గురించి మాట్లాడుతూ.. వీరంతా నా కుటుంబమేనని , నా..నా..నా..అంటూనే జగన్ తమపై కపట ప్రేమను చూపించారని మండిపడుతున్నారు . మరోవైపు రాజకీయ వర్గలు కూడా .. మైనారిటీల విషయంలో జగన్ మాటలను చూస్తే.. మైనారిటీల కోసమే తన రాజకీయ జీవితమంతా అంకితమిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నట్లుందని చెప్తున్నాయి .
2వేల కోట్ల మైనారిటీ నిధుల దారి మళ్లింపు..( YCP Strategy)
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్స్ బోర్టు భూములను వైసీపీ నేతలు కబ్జాలు చేస్తూ ..తమను రోడ్డుమీద పడేశారంటూ మైనారిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి . గత ప్రభుత్వ పథకాలను తుంగలో తొక్కి … నవరత్నాల పేరుతో జగన్ అందరికి ఇస్తున్న పథకాలకు కూడా మైనారిటీ బడ్జెట్ కేటాయింపులను వాడుకున్నాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి . జూన్ 2019 నుండి ఇప్పటి వరకు దాదాపు 2వేల కోట్ల రూపాయల మైనారిటీ నిధులను దారి మళ్లించిన ఘనత జగన్ కే దక్కుతుందని విమర్శకులు అంటున్నారు . గత ప్రభుత్వం అందించిన దుకాన్, మకాన్ పధకాలను కూడా .. జగన్ అధికారంలోకి రాగానే అర్ధాంతరంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే . మైనారిటీ భూములనే టార్గెట్ గా చేసుకుంటూ భూకబ్జాలతో పాటు దాడులకు సైతం పాల్పడుతున్నారంటూ మైనారిటీలు చెప్పుకొస్తున్నారు.
ఉర్దూ యూనివర్శిటీ.. హజ్ హౌస్ ఎక్కడ ?
అంతేకాదు చంద్రబాబు హయాంలో ఉర్దూ యూనివర్సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించి .. దాదాపు పనులను కూడా పూర్తి చేయగా .. జగన్ ఆ ఉర్దూ యూనివర్సిటీని పూర్తిగా పక్కన పెట్టేశారని విశ్లేషకులు చెప్తున్నారు .ఇది మాత్రమే కాదు విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాన్ని కూడా జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని .. ఉన్నత విద్య, విదేశీ విద్య .. మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందంటూ మైనారిటీ లు జగన్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు . తమపై దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు మర్చిపోలేని చారిత్రాత్మక తప్పిదాలు కావా..? అని మైనరిటీలందరూ మండిపడుతున్నట్లు తెలుస్తోంది.తమను ఇన్ని వివిధాలుగా ఇబ్బందులు పెడుతూ కూడా ..తిరిగి మైనారిటీ ఓట్లును ఆకర్షించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నాడని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో జగన్ కు మైనారిటీలు ఝలక్ ఇవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి జగన్ పై మైనారిటీల ఆగ్రహం ఎటువంటి పరిణామానికి దారి తీస్తోందనేది.