mega888 YCP MP Beeda Mastan Rao’s Daughter: మన దేశంలో ఆమ్‌ ఆద్మీ

YCP MP Beeda Mastan Rao’s Daughter: యువకుడిని కారుతో డీకొట్టిన వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తె

మన దేశంలో ఆమ్‌ ఆద్మీ ప్రాణానికి విలువ లేదని మరోసారి రుజువైపోయింది. ఇటీవలే పూనేలో ఓ సంపన్నుడి సుపుత్రుడు పూటుగా మందుకొట్టి రూ. 2.5 కోట్లు విలువ చేసే పొర్శ్చేకారును విపరీతమైన స్పీడ్‌తో నడుపుతూ... కారు ముందు వెళ్తున్న వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని స్నేహితురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

  • Written By:
  • Publish Date - June 19, 2024 / 06:46 PM IST

YCP MP Beeda Mastan Rao’s Daughter: మన దేశంలో ఆమ్‌ ఆద్మీ ప్రాణానికి విలువ లేదని మరోసారి రుజువైపోయింది. ఇటీవలే పూనేలో ఓ సంపన్నుడి సుపుత్రుడు పూటుగా మందుకొట్టి రూ. 2.5 కోట్లు విలువ చేసే పొర్శ్చేకారును విపరీతమైన స్పీడ్‌తో నడుపుతూ… కారు ముందు వెళ్తున్న వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని స్నేహితురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఈ సంఘటన మరిచిపోక ముందే చెన్నైలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు మాధురి చెన్నైలో సోమవారం రాత్రి బీఎండబ్ల్యు కారును నిర్లక్ష్యంగా నడిపి ఫుట్‌పాత్‌పై పడుకున్న వ్యక్తిపై నుంచి పోనిచ్చింది. గాయపడ్డ అతను తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు నామ్‌ కే వాస్తే అన్నట్లు అరెస్టు చూపించి తర్వాత బెయిల్‌ ఇచ్చారు.

జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురి బీఎండబ్ల్యు కారులో తన స్నేహితురాలితో కలిసి సోమవారం రాత్రి చెన్నైలో బీసెంట్‌నగర్‌లో వెళుతున్నారు. అప్పుడే 24 ఏళ్ల సూర్య అనే పెయింటర్‌ మద్యం తాగి పుట్‌పాత్‌పైనే నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆమె కారు బీసెంట్‌నగర్‌లో అదపు తప్పి పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సూర్యపై నుంచి పోనివ్వడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి మాధురి పారిపోయారు. అయితే కారులో ఆమె స్నేహితురాలు ఒక్కరే కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. అటు తర్వాత ఆమె కూడా వెళ్లిపోయారు. అయితే అక్కడ గుమిగూడిన వారిలో కొంత మంది సూర్యను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో తీవ్రగాయాలతో పెయింట్‌ సూర్య కన్నుమూశాడు.

అరెస్టు.. బెయిల్ ..(YCP MP Beeda Mastan Rao’s Daughter)

ఇక సూర్య విషయానికి వస్తే ఎనిమిది నెలల కిత్రమే పెళ్లి చేసుకున్నాడు. సూర్య చనిపోయిన వార్త తెలిసిన వెంటనే బంధువులు, స్థానికులు జె-5 శాస్ర్తినగర్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకొని మాధునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సీసీటీవీ పుటేజీని సమీక్షించిన తర్వాత ఈ కారు బీఎంఆర్‌ (బీద మస్తాన్‌రావు )గ్రూపునకు చెందినది గుర్తించారు. పుదుచ్చేరి రిజిస్ర్టేషన్‌ కలిగి ఉంది. పోలీసులు మాధురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో బెయిల్‌ మంజూరు చేశారు. ఇక మాధురి తండ్రి 2022లో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యాడు. అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక బీఎంఆర్‌గ్రూపు విషయానికి వస్తే సీ ఫుడ్‌ ఇండస్ర్టీస్‌లో అతి పెద్ద కంపెనీగా చెబుతున్నారు. మరి పెయింటర్‌ సూర్యకు న్యాయం జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.