Site icon Prime9

Pawan Kalyan: వైసీపీ నేతలకు నన్ను విమర్శించే అర్హత లేదు..పవన్ కళ్యాణ్

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: జనసేనకు యువతే పెద్ద బలమని పవన్ కళ్యాణ్ అన్నారు. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతు ఇస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలో జనసేన విస్తృతస్దాయి సమావేశంలో పవన్ ప్రసంగించారు.

వైసీపీ ట్రాప్ లో పడిపోవద్దు..(Pawan Kalyan)

మన పార్టీకి ఉన్న యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్య పోయారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం ఉంది. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలి. నాయకులు స్వార్దం వదిలేయాలని పవన్ అన్నారు.వైసీపీ నేతలకు నన్ను విమర్శించే అర్హత లేదు.ప్రజలకు ఏది అవసరమో అది చేస్తాను.కులం మీద రాజకీయాలు చేయడం లేదు. వైసీపీ ట్రాప్‌లో మీరు పడిపోవద్దు.అభివృద్ధిలో అన్ని మతాలు, కులాలను భాగస్వాములను చేయాలి.తలదించుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు.నేను మొదటి నుంచి పదవులను కోరుకోలేదు. జనసేన పార్టీ కమిట్ మెంట్, భావజాలం, కారణంగానే బీజేపీ మనతో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో యువత ఓటింగ్ కు దూరంగా ఉండడం బాధాకరమమని ఆయన చెప్పారు.జాతీయ నేతల గుర్తింపు కోసం తాను తహతహలాడనని ఆయన చెప్పారు.జనసేన పార్టీ ఏ సిద్దాంతాలకు ఏర్పడిందో ఆ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

Exit mobile version