Pawan Kalyan Comments: మంగళగిరి జనసేన ఆఫీస్‌లో శనివారం గ్రామపంచాయతీల సర్పంచ్లు సమావేశమయ్యారు. పంచాయతీలను కాపాడుకుందామనే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చర్చా గోష్టి నిర్వహించారు. 30 నెలలు దాటినా నిధులు రావడం లేదని సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు చెప్పారు. పూర్తయిన పనులకి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం నిధులు సర్పంచ్ ఖాతాలోకి..(Pawan Kalyan Comments)
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచ్లు నిధులు రావట్లేదని ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పాడిందని అన్నారు. సర్పంచ్ల అధికారాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. చెక్ పవర్ సర్పంచ్ వద్ద ఉండాలని.. దీన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్తాని పవన్ కళ్యాణ్ చెప్పారు.పంచాయతీల నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రం చెప్పింది. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి.సమిష్టిగా లేకపోతే ఎంత పోరాటం చేసినా ఫలితం దక్కదు. పంచాయతీ అధికారాలు సర్పంచ్లకు అప్పగించాలి.కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా సర్పంచ్ ఖాతాలోకి రావాలని పవన్ పేర్కొన్నారు.
పార్టీ లకు అతీతం గా గెలిచేది సర్పంచులేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రభుత్వం డెకాయిట్ దోపిడీ చేస్తోంది.73 ,74 రాజ్యాంగ సవరణ లు పంచాయితీ లకు హక్కు ఇచ్చింది. చెక్ పవర్ అదే విధం గా కేంద్రం నుండి వచ్చే నిధులు డైరెక్ట్ గా సర్పంచ్ లకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లు లొనే పడాలి. ఈ విషయాన్ని నేను కేంద్ర నాయకత్వం దృష్టికి నేను బలం గా తీసుకెళ్తాను.ఏకత్వం అనేది గ్రామ స్థాయి వ్యవస్థ లో చాలా అవసరం. గ్రామ వ్యవస్థ లు చాలా బలం గా ఉండాలి అందుకే గాంధీ గారు అన్నారు గ్రామలే ఈ దేశానికి పట్టుకొమ్మలని.చెక్ పవర్ ,అదే విధం గా పంచాయితీ నిధులు సర్పంచ్ అకౌంట్ లో వేసే విధం గా మా పార్టీ మ్యానిఫెస్టోలో పెడతాం. సర్పంచ్ లకు జీవిత భీమా వుండే విధం గా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు.