Site icon Prime9

AP Legislative Council: అప్పుడు వద్దన్నారు ఇప్పుడు అదే ఆధారం .. శాసనమండలిపై వైసీపీ నజర్

AP Legislative Council

AP Legislative Council

AP Legislative Council:రాజకీయాలు ఎప్పుడు ఒకేలా వుండవు కాల మాన పరిస్థితుల ఆధారంగా మారతాయి .ఒకప్పుడు వద్దన్నది ఇప్పుడు అవసరమవుతుంది . ఇప్పుడు అవసరమైంది మరో సమయంలో వద్దని పిస్తుంది.ఎన్టీఆర్ హయాంలో రద్దయిన ఏపీ శాసన మండలి మరలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారు .అప్పుడు టీడీపీ వ్యతిరేఖించింది .2019 లో వైసీపీ శాసన మండలి ని రద్దు చేయడానికి బిల్ పెడితే అదే టీడీపీ వ్యతిరేఖించింది .అప్పుడు రద్దుకు అనుకూలమైన వైసీపీకి ఇప్పుడు శాసన మండలే దిక్కైంది . ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి ఎక్కువ బలం వుంది .దింతో మండలిలో గట్టిగా పోరాడండి అని జగన్ తన శాసన మండలి సభ్యులతో చెప్పడం జరిగింది . ప్రస్తుతం శాసన సభ లో వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా అవసరమైన స్థానాలు కూడా రాలేదు. ఇక అసెంబ్లీలో మాట్లాడే చాన్స్ దాదాపుగా రాదు. వచ్చినా రెండు, మూడు నిమిషాలే కేటాయిస్తారు. 66 మంది ఉన్నప్పుడే జగన్ మాట్లాడలేకపోయారు .ఇప్పుడు 11 మంది ప్రతిపక్షం నుంచి ఎవరన్నా లేచి మాట్లాడటానికి ,ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తే అధికార పక్షం నుంచి 10 మంది లేచే అవకాశం వుంది . అందుకే మండలిని ఆయుధంగా చేసుకోవాలని జగన్ వ్యూహాలు పన్నుతున్నారు .

వైసీపీకి శాసనమండలిలోమెజార్టీ..(AP Legislative Council)

శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వైఎస్ఆర్సీపీకి అధికారికంగా 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఉపాధ్యాయ కోటాలో గెలిచిన వారు సాంకేతికంగా ఇండిపెండెంట్లు అయినప్పటికీ వైసీపీ నేతలుగానే ఎన్నికల్లో పోటీ పడి గెలిచారు. అందుకే మొత్తంగా వైసీపీకి 42 మంది ఎమ్మెల్సీల బలం ఉందని అనుకోవచ్చు. టీడీపీకే కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే వైఎస్ఆర్‌సీపీకి శాసనమండలిలో తిరుగులేని మెజార్టీ ఉంది. ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీకి దక్కే అవకాశం లేదు. అయినప్పటికీ… మరో నాలుగేళ్ల పాటు ఈ ఆధిక్యాన్ని కొనసాగించగలుగుతుంది.

Exit mobile version
Skip to toolbar