Site icon Prime9

yanamala krishnadu: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు

yanamala krishnadu

yanamala krishnadu

yanamala krishnadu:ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు పెద్ద షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు ,టీడీపీ నేత యనమల కృష్ణుడు.. టీడీపీకి రాజనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తుని టికెట్ విషయంలో సోదరులిద్దరికి విభేదాలు పొడచుపాయి. తునిలో యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి సోదరుడు కృష్ణుడే కీలక పాత్ర పోషించాడని స్థానికులు చెబుతున్నారు .

గత నలభై ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో యనమల రామకృష్ణుడు కు పెద్ద షాక్ తగిలినట్లు విశ్లేషకులు చెబుతున్నారు . యనమల రామకృష్ణుడు 1983 నుంచి 2004 వరుకు తుని ఎమ్మెల్యే గా కొనసాగారు .2009 లో ఓటమి చెందడంతో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టపెట్టారు .అప్పటి నుంచి రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా వుంటున్నారు . 2014, 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు తన సోదరుడు యనమల కృష్ణుడు కు టీడీపీ తరుపున తుని టికెట్ ఇప్పించారు .ఆ ఎన్నికల్లో కృష్ణుడు ఓటమి చెందారు .మరలా 2019 లో కూడా టీడీపీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి చెందారు.

యనమల కుమార్తెకు సీటు ఇవ్వడంతో..(yanamala krishnadu)

రాబోయే ఎన్నికల్లో యనమల కృష్ణుడి స్థానంలో తన కుమార్తె ను రామకృష్ణుడు ఎన్నికల బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు సీటు వచ్చేలా రాజకీయం నడిపారు. ఈ క్రమంలో యనమల కృష్ణుడిని ఆయన దూరం పెట్టారు. దీంతో, యనమల సోదరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి జరిగే ఎన్నికల కోసం కృష్ణుడు ప్రణాళికలు చేసుకున్నప్పటికీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఇదే సమయంలో తన కుమార్తె దివ్యను ఎలాగైనా గెలిపించుకోవాలని రామకృష్ణుడు పార్టీలోకి ఇతరులను చేర్చుకుంటున్నారు . దీంతో ఆయన మరింత మనస్థానపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Exit mobile version