Jaganmohan Reddy in Assembly:ఐదేళ్లు ఎదురు లేని పాలన,తిరుగులేని విజయాలు, తనమాటే శాసనం ,తాను తలచినదే చట్టం అన్న రీతిలో కొనసాగిన జగన్ పరిపాలనకు ఆంధ్ర జనం మంగళం పాడింది తెలిసిందే .అతి దారుణ ఓటమి చవిచూసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .
అనూహ్య మెజారిటీ 151 శాసనసభ స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్ అచిర కాలంలోనే ప్రజా వ్యతిరేఖత మూట గట్టుకున్నారు .2019 మే నుంచి 2024 మే వరుకు ఏకఛత్రాదిపత్యంగా పాలన కొనసాగించారు .భారీ మెజారిటీ జగన్ కు అధికార మదాన్ని తలకెక్కించింది .దింతో తనకు తోచిన విధంగా పరిపాలన సాగించారు .తనకు తిరిగు లేదనుకున్నారు.జనసేనాని పవన్ కళ్యాణ్ ను చాలా తక్కువ అంచనా వేశారు .అంతే స్థాయిలో చాలా హేళనగా మాట్లాడారు .చివరికి మట్టి గరిచారు .తన సామజిక వర్గానికి చెందిన వారిని ఎంతో మందిని సలహాదారులుగా నియమించుకున్న జగన్ ఆంధ్రరాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు .మితిమీరిన ఆత్మవిశ్వాసం తో అధః పాతాళానికి దిగిపోయారు .పవన్ కళ్యాణ్ శపధం నెరవేర్చడానికి జగన్ తానే దోవ చూపినట్లయింది .
గతంలో 1994 లో కాంగ్రెస్ పార్టీ కి ఇలానే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది .మళ్ళీ ౩౦ ఏళ్ళ తర్వాత జగన్ కు అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది .కనీసం ప్రతిపక్ష హోదా వున్నా గౌరవంగా సభలో పాల్గొనే అవకాశం ఉండేది .ఇప్పుడు అసెంబ్లీ జగన్ ఏది మాట్లాడినా అధికార పక్షం నుంచి మతాల తూటాలు దూసుకు వస్తాయి .ఒకే సారి 164 మంది ఎగబడినా ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు .గతంలో 2014 లో 66 ఎమ్మెల్యే లు ఉన్నప్పటికీ జగన్ పై అచ్చెన్నాయుడు ,బోండా ఉమా లాంటి వాళ్ళు విరుచుకు పడే వారు .ఇప్పుడు అసెంబ్లీ లో జనసేనకు వైసీపీ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యే లు వున్నారు .ఈ సారి అసెంబ్లీ లో జగన్ పైకి టీడీపీ సభ్యులు కన్నా జనసేన సభ్యులు ఎక్కువగా దూసుకు పోయే ప్రమాదం వుంది. ఈ తరహా సంఘటనలు ఎదుర్కోవడానికి జగన్ కు గాని వైసీపీ ఎమ్మెల్యేలకు గాని సత్తా ఉండదు .జగన్ తర్వాత పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ,బాలనాగి రెడ్డి మాత్రమే సీనియర్లు .అధికార పక్షం దాటికి తట్టుకునే శక్తీ ఇప్పుడు వైసీపీ కి లేదు .ఇలాంటి తరుణంలో జగన్ అసెంబ్లీ కి వెళ్లి అవమానాలు పడడం అవసరమా అని కొంత మంది వైసీపీ నాయకులూ చెవులు కోరుకుంటున్నారు .
గత అసెంబ్లీ లో 23 స్థానాలు వున్నటీడీపీ ని ఎలా ఆట పట్టించారో అందరికి తెలిసిన విషయమే .ఇప్పుడు 10 మంది తో జగన్ అసెంబ్లీ లో ఏమి చేయగలడు .నవ్వుల పాలు కాక తప్పదు .చంద్రబాబుకు అసెంబ్లీ లో జరిగిన అవమానాలు చివరికి అయన కంటి వెంట నీరు తెప్పించాయి .మరి దెబ్బకు దెబ్బ అన్న రీతిలో సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఐదేళ్ల పాటు అసెంబ్లీ లో జగన్ కు కూడా ఎన్ని అవమానాలు జరగనున్నాయో ఊహాతీతం .వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే జగన్ అసెంబ్లీ కి రాడనేది తెలుస్తోంది .కడప పార్లమెంట్ నుంచి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది .అప్పుడు పులివెందుల నుంచి అవినాష్ రెడ్డి ని అసెంబ్లీ కి పంపుతాడని ఒక ఆలోచన చేస్తున్నట్లు సమాచారం .మరో వైపు ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లి అవమానాలు పడి ఆ సానుభూతితో 2029 లో మళ్ళీ అధికారంలోకి రావచ్చనేది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది .ఎటు అసెంబ్లీ సమావేశాలు చప్పగా జరుగనున్నాయి .ఒక వేళ అసెంబ్లీ కి వెళ్ళితే ప్రజల పక్షాన నిలబడినట్లుంటుంది .వెళ్ళక పోతే కాడి పడేసినట్లుంటుంది .రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు ప్రజలు భావిస్తారు . మరో వైపు తాజాగా ఎమ్మెల్సీ లతో మాట్లాడుతూ చట్టసభల్లో పోరాటం చేద్దామని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది .ఏదిఏమైనా జగన్ అసెంబ్లీ కి వస్తాడా ? రాడా అనేది తెలియాలంటే అసెంబ్లీ మొదటి సమావేశాలు వరకు వేచిచూడాల్సిందే ..