Janasena chief Pawan Kalyan: ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్‌సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
డేటా సేకరణకు ఆదేశాలు ఇచ్చేది ఎవరు? (Janasena chief Pawan Kalyan)
వాలంటీర్లకి బాస్ ఎవరు.? ప్రయివేటు డేటా సేకరించాలని ఆదేశాలు ఇస్తున్నది ఎవరు.? అది ప్రైవేట్ కంపెనీయా.? అయితే దాన్ని నడుపుతున్నదెవరు.? అది ప్రభుత్వ సంస్థ అయితే డేటా కలెక్ట్ చేయమని చెప్పిందెవరు.? ప్రధాన కార్యదర్శా లేక ముఖ్యమంత్రా లేక కలెక్టర్లా లేక ఎమ్మెల్యేలా .? ఎవరన్నది ప్రజలకి చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తూ పవన్ ట్వీట్ చేసారు.
ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, @PawanKalyan గారు డేటా లీకేజీ అంశంపై నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడంతో మొదలుపెట్టిన ప్రజలు.
త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు @YSRCParty పై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్దంగా ఉండు జగన్… pic.twitter.com/T7yuV6WUZz
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 21, 2023