Site icon Prime9

YS Sharmila: కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చింది ? వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila: వైఎస్సార్‌టీపీకి వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్‌ భయపడుతోందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలఅన్నారు . షర్మిల గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై‌ సౌందర్‌రాజన్‌ను కలిశారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, వైఎస్సార్‌టీపీ ప్రజాప్రస్థాన యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలను గవర్నర్‌కు వివరించడం జరిగిందన్నారు.

తాను 3,500 కి.మీ పాదయాత్ర చేశానని.. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాలేదని అన్నారు. కావాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబం కేసీఆర్‌ది అని ఆరోపించారు. కేసీఆర్‌‌ కుటుంబానికి వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఉందన్నారు. కాంట్రాక్టుల పేరుతో కేటీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై అన్ని రకాల విచారణలు జరగాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని. ప్రగతి భవన్లో కేంద్ర సంస్థలు దాడులు చేస్తే వేల కోట్లు దొరుకుతాయన్నారు. దేశంలోనే కేసీఆర్ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అన్నారు. తనకు, తనవాళ్లకు ఏం జరిగినా కేసీఆర్దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏమిలేని వాళ్లకు వందల కోట్లు ఎలా వచ్చాయని షర్మిల ప్రశ్నించారు.

అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్రలో కేసీఆర్ హామీలపై ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ వయోలేషన్ కేసులో రిమాండ్ అడగడం ఏంటని నిలదీశారు. డబ్బు సంపాదించేందుకే అధికారాన్ని వాడుతున్నారన్నారు.నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని షర్మిల విమర్శించారు. తాను చెప్పుతో కొడతా అని..ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని..ఇంకెవర్ని అనలేదని స్పష్టం చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామన్నా ఆమె..ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.

కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆమె ఆంధ్రా ఆవిడ కాదా అని అడిగారు. తాము ఆమెను గౌరవించడం లేదా?.. ఏమైనా విడాకులు తీసుకోమని అడిగామా? అని షర్మిల ప్రశ్నించారు.తాను ఇక్కడే పెరిగా.. ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. ఇక్కడే కొడుకుని కన్నా అని చెప్పారు. తన గతం ఇక్కడే ఉందని.. భవిష్యత్ కూడా ఇక్కడేనని షర్మిల అన్నారు.

Exit mobile version