Site icon Prime9

Jagdish Reddy: రాజగోపాల్ రెడ్డి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.. మంత్రి జగదీష్ రెడ్డి

jagadish reddy

jagadish reddy

 Jagdish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కొరకు వచ్చింది కాదు. ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చాయని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి తన కుటుంబ స్వార్థం కోసం ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకున్నాడని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే నైతికత లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడులో పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినట్టుగా బహిర్గతమైందన్నారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి.. త్యాగాలు చేశామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడు సీట్లున్న పార్టీలోకి వెళితే మునుగోడు నియోజకర్గం అభివృద్ది చెందుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రలో భాగంగానే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిందన్నారు. మునుగోడు ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని కోరారు.

బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని, దేశంలో నిత్యావసరాలతో పాటు అన్ని రేట్లు పెరుగుతాయని  జగదీష్ రెడ్డి  చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తామని.. అభివృద్ధి పనులు కొనసాగుతాయని వివరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం కోసమే మునుగోడు ఉప ఎన్నిక అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఎక్కడికక్కడ రాజగోపాల్ రెడ్డిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు.

Exit mobile version