CM Revanth Reddy:ఈ నెల ఎనిమిదో తేదీ లోపు రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొమ్మిదో తేదికేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. ఆసరా ఫించన్లు కూడా ఈ నెల 9వ తేదీలోగా అందరి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.
ఎవరిని చెప్పుతో కొట్టాలి ? (CM Revanth Reddy)
బీజేపీపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని పునరుద్ఘాటించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజ్యాంగాన్ని మారుస్తమని ఎవరన్న అంటే వాణ్ని చెప్పుతో కొట్టాలని అన్నారని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో రాజ్యాంగంలోని ప్రియంబుల్ మారుస్తమని చెప్పాడని తెలిపారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసత్యపు ప్రచారాలు చేస్తూ ఈ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నాయన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీం అని, తెలంగాణ టీంకు రాహుల్ నాయకత్వం వహిస్తారని, గుజరాత్ టీంను ఓడించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని అనేక కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పి కొట్టాలని రేవంత్ పిలుపు నిచ్చారు.