Prime9

Vijayawada: నారా లోకేష్ ను కలిసిన విజయవాడ సిటీ వైసీసీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

Vijayawada: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా అధికార వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు.

అవినాష్ ఎంట్రీతో..(Vijayawada)

విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు.దేవినేని అవినాష్ వైసీపీ లో చేరిన తరువాత భవకుమార్ కు ప్రాధాన్యత తగ్గింది. అవినాష్ ను సీఎం జగన్ నియోజక వర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో కొంత కాలంగా వైసీపీ అధిష్టానం తీరు పట్ల భవకుమార్ అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే భవకుమార్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. లోకేష్ ని కలిసిన వారిలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్, పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ ఉన్నారు.

జగన్ కు బిగ్ షాక్..టీడీపీ లోకి బొప్పన భువకుమార్ ఎంట్రీ | YCP Leader Joins In TDP Party |Prime9 News

Exit mobile version
Skip to toolbar