Site icon Prime9

YS Sharmila Arrested : వైఎస్‌ షర్మిల అరెస్ట్

ys sharmilia arrest

YS Sharmila: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కార్యకర్తలపై పోలీసులు లారీఛార్జ్‌ చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ శ్రేణులు షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. వైఎస్సార్ టీపీ ఫ్లెక్సీలను చింపివేసారు. షర్మిల బస్సుకు నిప్పంటించారు. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ మా పాదయాత్రకు అనుమతి ఉంది. బస్సును దగ్ధం చేసినవారిని అరెస్ట్‌ చేయకుండా.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు అని మండిపడ్డారు.శాంతిభద్రతల సమస్యను చూపించి తనను అరెస్ట్ చేయాలని, తద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులను పనోళ్లలాగా వాడుకుంటున్నారని షర్మిల విమర్శించారు.

Exit mobile version