Site icon Prime9

Amit Shah in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah in Tirumala

Amit Shah in Tirumala

 Amit Shah in Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా…టీటీడీ ఈవో ధర్మారెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా లడ్డు ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు.

కట్టుదిట్టమైన భద్రత..( Amit Shah in Tirumala)

అంతకు ముందు ఆలయం వద్దకు వచ్చిన హోం మంత్రి అమిత్ షాకు మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆలయం ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రాత్రి తిరుమలలోని వకుళామాత అతిథి భవనం లో బస చేశారు. ఇవాళ 12 గంటల అనంతరం తిరుమల నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version