Site icon Prime9

Bandi Sanjay : ట్విట్టర్ టిల్లు…డ్రగ్స్ బానిస .. కేటీఆర్ పై బండిసంజయ్ ఫైర్

Bandi sanjay

Bandi sanjay

Bandi Sanjay: మంత్రి కేటీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ టిల్లు…డ్రగ్స్ బానిస అంటూ విరుచుకుపడ్డారు.నమూనాలిస్తే అంతా నిరూపిస్తానని…రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. నేను తంబాకు తింటానని కేటీఆర్ పచ్చి అబద్దాలు ప్రచారం చేసారన్నారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను రీ ఓపెన్ చేయించాల్సిందే’’ అని డిమాండ్ చేసారు..జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. దేశంలోని అన్ని పార్టీలు, అందరు సీఎంలు వెళ్లినా… కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో సమాధానమివ్వాలన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను తంబాకు తింటానని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. తనకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా… అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇస్తానని సవాల్ చేశారు. మరి కేటీార్ రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదని..డాక్టర్ దగ్గరికి వెళ్లి కేటీఆర్ వి రెండు వెంట్రుకలు ఇస్తే చాలు.. డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుస్తుందన్నారు.

ఒక బెంగళూరు డ్రగ్స్, హైదరాబాద్ డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తామని.. లంగదందాలు దొంగ దందాలు చేస్తే .. చూస్తూ ఊరుకుంటామా? అని హెచ్చరిచారు ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని బండి సంజయ్ ఆరోపించారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు.

Exit mobile version