Tollywood Drugs: హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని అధికారులు అరెస్టు చేశారు. వీరిలో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన వారిని మాధాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పగించారు.
అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీ..( Tollywood Drugs)
మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు. సినీ నిర్మాత వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు తెలిపారు. బాలాజీ, కె.వెంకటేశ్వరరెడ్డి, డి.మురళీ, మధుబాల, మేహక్ లను అరెస్ట్ చేశారు. బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీలు నిర్వహిస్తున్నారు వెంకట్. వెంకట్ కదలికలపై 3 నెలలుగా నిఘా పెట్టారు నార్కోటిక్ బ్యూరో. వెంకట్‌కు డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వెంకట్ వాట్సప్ చాట్‌లో డ్రగ్స్ పార్టీపై చాటింగ్ చేసినట్లు గుర్తించారు.
మాదాపూర్ కేంద్రంగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలాజీ కేంద్రంగానే హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా సాగుతోందని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో పలుమార్లు బాలాజీ డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడని దర్యాప్తులో బయటపడింది. గతంలోనూ బాలాజీ డ్రగ్స్ పెడ్లింగ్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. అలాగే నిర్మాత వెంకట్, బాలాజీ ఇద్దరూ వ్యభిచార దందా కూడా నడుపుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.