Site icon Prime9

YS Sharmila: హత్యలు చేయడానికే అధికారాన్ని వాడుకున్నారు.. వైపీసీ నేతలపై మండిపడ్డ వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila:ఎంపీగా అవినాష్‌రెడ్డి విభజన చట్టంలో పేర్కొన్న కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు షర్మిల . హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

సీబీఐ ఆధారాలతోనే..(YS Sharmila)

అవినాష్‌ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. కాల్‌ రికార్డ్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి అధారాలు సీబీఐ బయటపెట్టింది . బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారు. జగన్‌కు అధికారమిచ్చింది ఆయన్ను కాపాడటానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా… ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా? అని ప్రపంచమంతా చూస్తోంది. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్నానని షర్మిల సభను ఉద్దేశించి ప్రసంగించారు .

న్యాయంకోసం పోరాడుతున్నాం..

ఇదే ఎన్నికల ప్రచార సభలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు .తన తండ్రిని దారుణంగా హతమార్చారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. న్యాయం కోసం తామిద్దరం పోరాడుతున్నామని చెప్పారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చన్నారు. ప్రజా తీర్పు పెద్దదని.. దానికోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి రేపో మాపో జైలుకు పోతారు. జైలుకు పోయేవారు కాదు.. జనాల్లో ఉండేవాళ్లు రావాలి. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కలిగించండని సునీత కోరారు.

Exit mobile version