Site icon Prime9

Roja: ప్రతిరోజు మెంటల్ టెన్షన్ పెడుతున్నారు.. సొంతపార్టీ నేతలవైఖరిపై మంత్రి రోజా ఆవేదన

Roja

Roja

Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. విపక్షనేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు. అయితే తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం అక్కడ పార్టీలోనే రోజాకు అసమ్మతి వర్గం తయారయింది. దీనితో ఆమె ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం గురించి రోజాకు సమాచారం లేనట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండికూడా తన నియోజకవర్గంలో కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేకపోవడంపై రోజా హర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి కార్యకర్తలతో రోజా మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది.

మంత్రిగా ఉన్న నన్ను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా.. టీడీపీ, జనసేన నవ్వుకునే విధంగా.. ఆ పార్టీలకు సపోర్టు అవుతూ.. నాకు నష్టం జరిగే విధంగా.. మన పార్టీని దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంత వరకు కరెక్ట్.. మీరంతా ఆలోచించాలి.. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే నేను రాజకీయాలు చేయడం కష్టం. నేను ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతిరోజు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా పార్టీకి, మాకు నష్టం చేకూరుస్తున్నారు. వీళ్లు పార్టీ నాయకులని చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తుంది అని రోజా పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar