YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు. ఆస్తి కోసం అయితే ఈ హత్య జరగలేదని షర్మిల స్పష్టం చేశారు. ఆస్తులన్నీ ఆయన కూతురు సునీత పేరు మీద ఉన్నాయని చెప్పారు.
షర్మిల కామెంట్స్..
వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు. ఆస్తి కోసం అయితే ఈ హత్య జరగలేదని షర్మిల స్పష్టం చేశారు. ఆస్తులన్నీ ఆయన కూతురు సునీత పేరు మీద ఉన్నాయని చెప్పారు.
వైఎస్ వివేకా హత్యపై.. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ వివేకా..వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. వివేకానంద ప్రజల మనిషని.. ఆయనకు పదవులపై రాజకీయంపై ఎలాంటి ఆశలు లేవని తెలిపారు. సాధారణ జీవితం గడిపే వ్యక్తి అని షర్మిల అన్నారు.
ఈ మేరకు మీడియాతో షర్మిల మాట్లాడారు. వివేకా పేరుపై ఉన్న ఆస్తులన్నీ సునీత పేరుమీద రాసినట్లు ఈ సందర్భంగా షర్మిల మీడియాకు వెల్లడించారు. సునీత పేరు మీదు ఉన్న ఆస్తులను వేరే వారికి రాసి ఇస్తారనడంలో అర్ధం లేదన్నారు. ఆస్తుల కోసమే ఈ హత్య జరిగితే.. వివేకాను హత్య చేయాల్సింది కాదని.. సునీతను చంపాల్సింది అని అన్నారు.
వైఎస్ వివేకా పేరు మీద ఉన్న అరకొర ఆస్తులను సునీత పిల్లల పేర్లపై రాశారని తెలిపారు. వైఎస్ వివేకా గురించి.. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసని షర్మిల అన్నారు.