YS Sharmila: రాష్ట్రంలో కేసీఆర్ అరాచకాలు మితీమీరిపోతున్నాయని.. వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో.. అరెస్టైన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. చంచల్ గూడ జైలునుంచి షర్మిల విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని చూస్తే.. అంత పైకి వస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడిన షర్మిల..
రాష్ట్రంలో కేసీఆర్ అరాచకాలు మితీమీరిపోతున్నాయని.. వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో.. అరెస్టైన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. చంచల్ గూడ జైలునుంచి షర్మిల విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని చూస్తే.. అంత పైకి వస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో కేసీఆర్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని.. షర్మిల అన్నారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని తెలిపారు. కారణం లేకుండా తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను రాజశేఖర్ బిడ్డనని.. ఎవరికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
ఆత్మ రక్షణకే అలా చేశా..
పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తనను పోలీసులు బెదిరించారని.. ఆత్మ రక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు మీడియాకు వివరించారు. తాను ఎవరిమీద చేయి వేయలేదని అన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్ ఆఫీస్‌కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు.