Ys Sharmila Arrest : ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ.. ట్యాంక్‌బండ్ పై రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద మౌన దీక్షను చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు ధరించి.. సాయంత్రం వరకు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్ఆర్‌టీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
షర్మిల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా దీక్షకు అనుమతి లేదంటూ షర్మిలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. పోలీసులు షర్మిలను బలవతంగా దీక్షా స్థలి నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం లోటస్ పాండ్‌కు షర్మిలను తరలించారు. ఈ సందర్భంగా షర్మిల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలకు అసలు భద్రత లేదని ఆరోపించారు. మద్యానికి ఇచ్చిన విలువ కూడా మహిళల భద్రతకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శలు కురిపించారు.
అలానే షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మహిళలకు భద్రత కల్పిస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా 25 వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నెంబర్ వన్ గా ఉందని, మహిళలను ఎత్తుకు పోవడంలో కూడా రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహిళలను సీఎం కేసీఆర్ కేవలం ఓట్లు వేసే యంత్రాల మాదిరిగానే చూస్తున్నాడని.. కేసీఆర్ కు మహిళల పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. మహిళ భద్రతకు చిన్నదొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడని.. ఆ భరోసా యాప్ ఎక్కడ ఉందని షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్‌మైన్‌లా తయారైందని, మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందో తెలియదన్నారు. గడిచిన ఐదేళ్లలో వేల కేసులు నమోదయ్యాయని.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కులేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదని.. స్వయంగా మంత్రుల బంధువులు రేప్‌లు చేసినా దిక్కులేదంటూ షర్మిల విమర్శించారు. కేసీఅర్‌కు ఆడవాళ్లంటే వివక్ష అని, ఆడవాళ్లు అంటే కక్ష్య అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దళిత మహిళలు అని చూడకుండా దాడులు చేస్తున్నారని.. దళిత మహిళలను లాకప్ డెత్‌లు చేస్తున్నారని, తెలంగాణలో ఓకే ఒక్క మహిళ మాత్రమే రక్షణ ఉందంటూ తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఒక్క మహిళ ఎమ్మెల్సీ కవిత అని మండిపడ్డారు.
#WATCH | Hyderabad, Telangana: YSRTP chief YS Sharmila taken into preventive custody by Police after she staged a protest at Tank Bund against state govt on atrocities against women. She was initially shifted to Bollaram police station and is now being shifted to her residence in… https://t.co/JXXved913b pic.twitter.com/ojQEbaFjsp
— ANI (@ANI) March 8, 2023
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/