Site icon Prime9

Murder Mystery : వికారాబాద్‌ శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ.. ఆ కారణంగానే హతమార్చారా ?

wife killed husband for illegal relationship

wife killed husband for illegal relationship

Murder Mystery : వికారాబాద్ లో జరిగిన శిరీష హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పరిగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంట్లో వాళ్ళు మందలించడంతో శనివారం రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఎస్సై విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్‌ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్‌ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్‌ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్‌ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్‌ వచ్చిన అనిల్‌.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది.

శిరీష అన్న శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద హత్యకేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి కేసును చేధించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణా సాగర్‌ రెడ్డి, సీఐ వెంకట్రామయ్య సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. శిరీష అక్క శ్రీలత భర్త అనిల్ ఆమెను దారుణంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది.

అనిల్, శిరీష మధ్య కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కూడా ఉందని తేలింది. తొలుత శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నావ్ అంటూ శిరీషను ఆమె అన్నయ్య తిట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటికొచ్చిన బావ అనిల్ కూడా శిరీషను కొట్టాడు. దీంతో ఆమె మనస్థాపం చెందింది. అప్పుడు అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత.. శిరీష తలుపుని బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది. ఇద్దరు కలుసుకున్న తర్వాత.. వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో.. శిరీషపై అనిల్ అత్యాచారం చేసి.. తర్వాత ఆమె గొంతు కోసి స్క్రూ డ్రైవర్‌తో కళ్లను చిద్రం చేసి, ఇంటికి కిలో మీటర్ దూరంలో ఉన్న నీటిగుంటలో పడేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.

Exit mobile version
Skip to toolbar