Site icon Prime9

TS ECET Web Counselling 2022: నేటి నుంచే టీఎస్ ఈసెట్ వెబ్ కౌన్సిల్సింగ్

TS ECET WEB COUNSELLING 2022 prime9 news

TS ECET WEB COUNSELLING 2022 prime9 news

TS ECET Web Counselling 2022: టీఎస్-ఈసెట్ 2022 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం tsecet.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చని మరియు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చని తెలంగాణస్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వెల్లడించింది.

వెబ్ కౌన్సెలింగ్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 11గా పేర్కొంది. సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 12, 2022 వరకు ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారి ధృవ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 14వ తేదీన ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుందని మరియు సీట్ల తాత్కాలిక కేటాయింపు జరుగుతుందని వెల్లడించింది. ట్యూషన్ ఫీజులు మరియు కాలేజీలలో స్వీయ రిపోర్టింగ్ సెప్టెంబర్ 17 నుండి సెప్టెంబర్ 22, 2022 వరకు జరుగుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొనింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మొదటిగా స్లాట్‌ను బుక్ చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలి. ఆ తర్వాత జాగ్రత్తగా నమోదు వివరాలతో లాగిన్ అవ్వాలి మరియు సేవ్ చేసిన ఎంపికల జాబితాను ముద్రించుకోవాలి. పూర్తయిన తర్వాత సరిగ్గా లాగ్ అవుట్ అవ్వాలి.

 

Exit mobile version