Site icon Prime9

Gadwal MLA: అధికారి కాలర్ పట్టుకుని తోసేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

TRS MLA

TRS MLA

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అంతేకాదు అసభ్యంగా మాట్లడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. తనతో కాకుండా జడ్పీ ఛైర్మన్‌తో ఆ స్కూలును ప్రారంభించడమే దీనికి కారణం.

గద్వాలలో బీసీ గురుకుల పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించాలి. అయితే, ఆయన సమయానికి రాకపోవడంతో జడ్పీ ఛైర్ పర్సన్ సరితతో ఆ పాఠశాలను ప్రారంభం చేయించారు. కార్యక్రమం అనంతరం అక్కడికి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహానికి గురై ఇదేంటని ప్రశ్నించారు. కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందని తాను ఫోన్లు చేస్తూనే ఉన్నానని, ఇంకో అర్ధగంటలో రండి అంటూ మీరే నన్ను ఆలస్యం అయ్యేలా చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెనకే ఉన్న విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకుని వెనక్కి తోసేశారు.

గద్వాల టీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ కొనసాగుతుంది. జెడ్పీ చైర్ పర్సన్ సరితతో కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు.

Exit mobile version