Site icon Prime9

Amit Shah: అమిత్ షా కాన్వాయ్ కి కారు అడ్డు.. అద్దాలు పగులగొట్టి మరీ..

Amith shah convoy

Amith shah convoy

Hyderabad: అసలే తెలంగాణ రాష్ట్రంలో తెరాస వర్సెస్ భాజపా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటనలో పోలీసుల భద్రతా లోపం చోటుచేసుకుంది.

హరిత ప్లాజా మీదుగా వెళ్తున్న అమిత్‌ షా కాన్వాయ్‌కి టీఆర్‌ఎస్‌ నేత కారు అడ్డుగా వచ్చింది. దానితో కారు అడ్డుతియ్యాలని పోలీసులు హెచ్చరించారు. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది తెరాస నేత కారు వెనుక అద్దం పగులగొట్టారు. అనంతరం ఆ కారును పక్కకు తీసి అమిత్ షా కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన పై ఎస్పీజీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన పై కారులో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతను జరిగిన విషయం పై మీడియా ప్రశ్నించగా, అనుకోకుండా కారు ఆగిపోయిందని తెరాస నేత క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎస్పీజీ అధికారులకు చెప్తానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు, అమిత్‌ షా పర్యటనలో భద్రతా వైఫల్యం పై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యం పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎంపీ లక్ష్మణ్ కోరారు. కేంద్ర హోం మంత్రి పర్యటనలోనే ఇలా జరిగితే ఇతరులను ఎలా రక్షిస్తారు? అంటూ విమర్శించారు. భద్రతా వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఇదీ చదవండి: Amit Shah: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వల్లే భాగ్యనగరానికి విముక్తి

Exit mobile version