Komati Reddy: మునుగోడు ఉప ఎన్నికల్లో నేతలు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించుకొనే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ను భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికించారు.
నిన్నటిదినం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తెరాస శ్రేణులు రెచ్చిపోయారు. ఆ క్రమంలో మంత్రి కేటిఆర్ మరో అడుగు ముందుకేసి తెరసా అభ్యర్ధిని ఎన్నికల్లో గెలిపిస్తే మునుగోడు నియోజక వర్గాన్ని దత్తతకు తీసుకొంటానని ప్రతిజ్న చేశారు.
దీంతో భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో గడిచిన మూడున్నర సంవత్సరాలుగా మునుగోడు నియోజక వర్గంలో ఉన్న సమస్యలపై గొంతెత్తి అరిచినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అప్పుడు కానరాని మునుగోడు, ఇప్పుడు గుర్తొచ్చి దత్తత తీసుకొనే వరకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. అంటే మీ అభ్యర్ధికి మునుగోడును దత్తత తీసుకునే దమ్ము నువ్వు నిలబెట్టిన అభ్యర్థికి లేదా? నువ్వెందుకు దత్తత తీసుకోవాలి అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ఊరికి పది ఇండ్లు కట్టియ్యమంటే ఊరికి పది బెల్టు షాపులు పెట్టిండు. పింఛన్ ఇస్తున్నాడని కేసీఆర్‌కి ఓటస్తే మీ పిల్లల భవిషత్తు ఖరాబు చేసినట్లే. కేసీఆర్ ఉన్నా లేకున్నా పింఛన్ వస్తుంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మరీ మునుగోడును అభివృద్ధి చేస్తా అంటూ ఓటర్లకు కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
అధికార టిఆర్ఎస్, భాజపా, కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో తెరాస శ్రేణులు పదే పదే సీఎం కేసిఆర్ చేస్తున్న అభివృద్ధికే ఓటర్లు పట్టం కట్టబోతున్నారంటూ వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా తామేమి నెట్టింట తక్కువ కాదన్నట్లు భాజపా, తెరాస పార్టీలను ఏకిపారేస్తూ ట్విట్లను వైరల్ చేస్తుంది.
ఇది కూడా చదవండి:TS High Court: మునుగోడులో కొత్త ఓటర్ల ప్రక్రియ పెండింగ్ లో ఉంచండి.. తెలంగాణ హైకోర్టు