Site icon Prime9

Himanta Biswa Sarma: అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత

TRS-activist-obstructed-Assam-CM--speech

Hyderabad: హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అస్సోం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైక్ లాగారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించారు.

హైదరాబాద్ లో నేడు జరుగుతున్న వినాయక విగ్రహల నిమజ్జనం కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు. ఎంజే మార్కెట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు. ఈ సమయంలో హిమంత బిశ్వ శర్మ తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పై విమర్శలను టీఆర్ఎస్ నేత బిలాల్ సహించలేకపోయారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో బీజేపీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ ను పోలీసులు ఎంజె మార్కెట్ నుండి తీసుకొని వెళ్లిపోయారు. వేదిక పైకి ఎవరు వస్తున్నారో ఎవరూ వస్తున్నారో పట్టించుకోకపోతే ఎలా అని అసోం సీఎం భద్రతా సిబ్బంది హైద్రాబాద్ పోలీసుల పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Exit mobile version