Site icon Prime9

Hyderabad: మూడు నెలల్లో మూడు సార్లు చిక్కితే జేబుకు చిల్లే.. నగరంలో మారిన ట్రాఫిక్ రూల్స్

Traffic-Rules-in-Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారు ఇకపై జాగ్రత్తగా లేకపోతే వారి జేబుకు చిల్లు పడినట్లే. ఇకపై మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.

ప్రస్తుతం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.100 జరిమానా విధిస్తున్నారు. ఇకపై 3 నెలల వ్యవధిలో హెల్మెట్‌ లేకుండా మూడుసార్లు పట్టుపడితే మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200, మూడోసారి రూ.500ల చొప్పున జరిమానా విధిస్తారు. అంటే హెల్మెట్‌ లేకుండా మూడు సార్లు పట్టుబడితే మూడోసారి 400 శాతం అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ జరిమానాలతో అయినా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయని అధికారులు బావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో హెల్మెట్‌ లేకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి ప్రతిరోజు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వాహనాలు నడిపే వారు తప్పకుండా హెల్మె్‌ట్‌తో పాటు లైసెన్స్‌ కూడా తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version