Site icon Prime9

Prime Minister Modi: సింగరేణిని ప్రైవేటు పరంచేసే ఆలోచనలేదు.. ప్రధాని మోదీ

modi

modi

Ramagundam: సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చెయ్యదని ఆ ఆలోచన కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతమేనని, సింగరేణిని ప్రైవేటు పరం చేసే అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉందన్నారు. సింగరేణి పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. కేంద్రం వాటా కూడా విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఒక పని శంకుస్థాపన జరిగితే, పూర్తయ్యే వరకు విశ్రమించమన్న మోదీ దానికి రామగుండం ఎరువుల కర్మాగారం పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. 2006 లో శిలాఫలకం వేస్తే ఈ రోజు జాతికి అంకితం చేసామని అన్నారు. పది ఏళ్ళు కింద యూరియా కోసం విదేశాల మీద ఆధార పడ్డాం కానీ ఇప్పుడు యూరియా ఉత్పత్తి చేస్తున్నాం. దేశంలో ఎరువుల కంపెనీలన్నీ సాంకేతిక కారణంతో మూతపడితే రైతులకు అండాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ అయ్యింది. యూరియా కోసం, రైతులు లైన్లు కట్టారు, దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లారు. ఇదంతా గతం, 2014 తర్వాత యూరియ మీదనే దృష్టి పెట్టి బ్లాక్ మార్కెట్ ను ఆపేసామని మోదీ పేర్కొన్నారు. యూరియా ఎంత అవసరమో రైతులకు తెలియదు. యూరియా మీద అవగాహన కల్పించాం. రానున్న రోజుల్లో యూరియా సులభంగా దొరుకుతుంది.

రామగుండం కర్మాగారంతో దేశంలో ఐదు రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందిస్తాం. ఎరువుల భారం రైతుల మీద పడనివ్వనంటూ మోదీ స్పష్టం చేసారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలని రాజకీయ కుతంత్రాలతో స్వార్థ రాజకీయాలతో అభాసు పాలు చేస్తున్నారని మోదీ ఆరోపించారు. అలాంటి వాళ్ళని వెతికి వెతికి పట్టుకుంటాం. ఈ సభకు వచ్చిన జన సమూహంతో హైదరాబాద్ లో కొందరికి నిద్ర పట్టదని మోదీ ఎద్దేవా చేసారు. కరోనాపై భారతదేశం పోరాటం చూసి ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని అభినందిస్తున్నాయని మోదీ అన్నారు. ఈ రెండేళ్ల కష్టాలన్నీ తీరి రానున్న రెండేళ్లలో 30 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుందని మోదీ పేర్కొన్నారు.

 

Exit mobile version