Site icon Prime9

Dussehra Holidays: దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Dussehra-Holidays-2022

Hyderabad: అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది.

విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీన అంటే సోమవారం ప్రారంభం అవుతాయని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ సారి 9, 10 తరగతులకు సెలవులు తగ్గించాలని భావిస్తున్నట్టు మొదట్లో వార్తలొచ్చినా, తాజాగా మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్రాంతికి సెలవులను తగ్గించి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులను పెంచిన సంగతి తెలిసిందే.

Exit mobile version