Site icon Prime9

Tamilisai vs KCR: డియర్ తెలంగాణ సీఎస్.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గర కదా

KCR vs Tamilisai

KCR vs Tamilisai

 Tamilisai vs KCR: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా కేసీఆర్ సర్కార్ పై తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ ట్విటర్ సాక్షిగా విమర్శలు చేశారు.

 

రాజ్‌భవన్‌కు రావడానికి టైమ్ లేదా?

డియర్ తెలంగాణ సీఎస్.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌( Tamilisai vs KCR)  దగ్గరుందని, సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్‌భవన్‌కు రావడానికి శాంతికుమారికి సమయం లేదా?

అధికారికంగా రాలేదు.. ప్రొటో కాల్ లేదు. కనీసం మర్యాద పూర్వకంగా కూడా సీఎస్ నన్ను కలువలేదు.

స్నేహ పూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి’ అని సీఎస్ వైఖరిని తమిళిసై(Governor Tamilisai Soundararajan) తీవ్రంగా తప్పుబట్టారు.

‘మళ్లీ గుర్తు చేస్తున్నానని, ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి’తమిళిసై పేర్కొన్నారు.

 

 

 

తమిళసై పరోక్ష విమర్శలు( Tamilisai vs KCR)

గవర్నర్ తమిళిసై పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులు ఆమోదించకపోవడంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ సెక్రటరీ.

రిట్ పిటిషన్‌లో ప్రతివాదిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై పేరును ప్రస్థావించారు.

వాటిని వెంటనే ఆమోద ముద్ర వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరింది.

బిల్లుల ఆమోదంపై సుప్రీం లో ప్రభుత్వం పిటిషన్ వేయడంపై స్పందించిన గవర్నర్ తమిళసై పరోక్ష విమర్శలు చేయడం గమనార్హం.

 

పిటిషన్ లో ఏముంది?

సెప్టెంబర్ 14, 2022 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను పంపినా ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది.

ఈ క్రమంలో గవర్నర్ చర్యను విస్మరణ, రాజ్యాంగ విధినిర్వహణలో విఫలమైనట్టుగా పరిగణించాలని కోరింది.

బిల్లులకు ఆమోదం ముద్ర వేయకపోవడం తీవ్రమైన చట్టవ్యతిరేక చర్యగా గుర్తించాలని విజ్భప్తి చేసింది. ఇకపై అయినా ఈ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.

పెండింగ్ బిల్లుల కోసం మంత్రులు, సీనియర్ అధికారులు గవర్నర్ ను కలిశారని..క్లియర్ చేస్తామని చెప్పి కూడా చేయలేదని కోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది.

2023-24 బడ్జెట్ కు సంబంధించి ముందస్తు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టుకు ఆశ్రయించాల్సి వచ్చినట్టు పేర్కొంది.

 

 

 

Exit mobile version