Site icon Prime9

SIT Notice: ఆధారాలతో రండి.. బండి సంజయ్‌కు సిట్‌ నోటీసులు

bandi-sanjay-press-meet

bandi-sanjay-press-meet

SIT Notice: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయా నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.

ఆధారాలతో రండి.. (SIT Notice)

పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో సిట్ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ మేరకు విచారణ వేగవంతం చేసి సిట్. పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ ఓ సందర్భంలో వ్యాఖ్యనించారు. దీనిపై సిట్ స్పందించింది. ఎక్కువ ఎవరికి ర్యాంకులో వచ్చాయో.. వాటి వివరాలతో తమ ఎదుట హాజరు కావాలని సిట్ కోరింది.

మార్చి 24న తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని అందులో పేర్కొంది. పేపర్‌ లీక్‌ విషయంలో చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ తమ ఎదుట హాజరు కావాలని సిట్‌ ఆ నోటీసుల్లో పేర్కొంది. టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్‌ పేపర్ల లీక్‌ వ్యవహారంపై స్పందిస్తూ.. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఆధారాలు తమకు ఇవ్వాలని సిట్‌ తన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఇప్పటికే సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన తగిన ఆధారాలతో తమ ఎదుట హాజరు కావాలని కోరింది.

 

Exit mobile version