Site icon Prime9

సహజ ఫౌండేషన్ ద్వారా 20,000 పైగా బుక్స్ పంపిణీ చేసిన సహజ ఫౌండేషన్ ఫౌండర్ శైలజ విస్సంశెట్టి గారు

Shailaja Vissamshetty

శైలజ విస్సంశెట్టి  ( సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు ) ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజీస్టు , మోటివేషనల్ స్పీకర్ , స్టోరీ టెల్లర్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు శైలజ విస్సంశెట్టి గారు ఎంతో మందికి సహాయం చేశారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక బడికి పంపించకుండా పిల్లలను ఇంటి దగ్గరే ఉంచిన తల్లితండ్రులు ఇంకా ఉన్నారని …అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు చదువుకు మించిన పెద్ద బహుమతి ఏమి ఇవ్వలేమని సహజ ఫౌండేషన్ శైలజ విస్సంశెట్టి గారు పలు సార్లు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు.

పిల్లలకు మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళ భావోద్వేగాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, జీవితంలో ఎలా ఎదగాలి , గోల్స్ పెట్టుకొని వాటిని ఎలా రీచ్ అవ్వాలి ..ఇలా ఎన్నో తెలియని విషయాలు పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు ఎదిగేటప్పుడు సరియైన అవగాహన ఉండాలని , పిల్లలకు ప్రతీది వివరంగా చెప్పాలని శైలజ విస్సంశెట్టి గారు సూచించారు . చిన్నప్పటి నుంచే పిల్లల మీద దృష్టి పెట్టాలని , వాళ్ళని ప్రక్క దోవ వెళ్లకుండా తల్లిదండ్రులకు చూసుకోవాలిసిన బాధ్యత ఉందని అవగాహన కార్యక్రమాల్లో శైలజ గారు సూచించారు .

విద్యకు పేదరికం అడ్డు కాకూడదని ప్రతి యొక్క జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పిల్లలకు ఉచిత నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు.
ఇప్పటి వరకు 20,000 పైగా బుక్స్ పంపిణీ చేశారు. శైలజ విస్సంశెట్టి గారు చేసిన వివిధ రంగాల్లో ఎన్నో సేవలను అందించారు… ఆ సేవలను గుర్తించి శైలజ విస్సంశెట్టి ఎన్నో అవార్డులను, మొమెంటోలను అందుకున్నారు. మీరు ఇలాగే మీ సహజ ఫౌండేషన్ నుంచి మరెందరుకో సహాయం చెయ్యాలని , మీరు కన్న కలలు నెరవేరాలని, మీరు చేసిన సేవలను గుర్తిస్తూ మన వాయిస్ వారు శైలజ విస్సంశెట్టి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

Exit mobile version