Site icon Prime9

Divya Vani : కాంగ్రెస్ గూటికి చేరిన ప్రముఖ సీనియర్ నటి దివ్యవాణి..

senior actress Divya Vani joined in congress party

senior actress Divya Vani joined in congress party

Divya Vani : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరో జోష్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. ఇప్పుడు తాజాగా మరో నటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో 2019లో పార్టీలో చేరిన దివ్యవాణి.. తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించిన ఈమె ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఆ తర్వాత టీడీపీతో విభేదించి 2022లో పార్టీకి రాజీనామా చేసింది. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంది. ఇక అప్పట్లో టీడీపీని వీడుతూ పార్టీలో అవమానాలు తట్టుకోలేకే తెదేపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో తనను అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని.. కనీసం ప్రెస్‌మీట్లు పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదఅని ఆమె వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ని రేపాయి.

ఇక ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఇప్పుడు దివ్వవాణి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సహం లభించినట్లైంది. దివ్వవాణి (Divya Vani) ఇప్పటి వరకు ఏపీ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది వేచి చూడాలి. విజయశాంతికి ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించగా స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది.  మరి దివ్యవాణి ఎంతమేర ప్రజలపై ప్రభావం చూపిస్తారో చూడాలి..

 

 

Exit mobile version