Road Accident: మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ వాసులు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. వీళ్లు బంధువుల అంత్యక్రియలకు కోసం వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన..(Road Accident)
కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అన్నదమ్ములు గుజరాత్‌లోని సూరత్ వెళ్లారు. 5 రోజుల క్రితం వారి సొంత ఊరు చౌటపల్లిలో బంధువు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు ఈ నలుగురు తమ కుటుంబ సభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియల అనంతరం కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి మంగళవారం కారులో సూరత్ బయలు దేరారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.